NTV Telugu Site icon

Software Employee Suicide: శివాలయంలో ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Software Employee

Software Employee

Software Employee Suicide: ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు. చాలామంది అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే తమ బంగారం, బైక్ లను కూడా అమ్మేసి అప్పులు చెల్లిస్తారు. అయితే తాజాగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఐపీఎల్‌లో బెట్టింగులు పెట్టి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలం ఆకుల వారిపల్లి సమీపంలోని శివాలయంలో చోటుచేసుకుంది. శివాలయంలోనే ఉరేసుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also: Sudhakar: నేను బ్రతికే ఉన్నాను… దయచేసి వాటిని నమ్మొద్దు

మృతికి ఐపీఎల్ బెట్టింగ్ కోసం చేసినా అప్పులే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతుడు దెయ్యాల వారిపల్లికి చెందిన శ్రవణ్ కుమార్ రెడ్డి (24) గా గుర్తించారు. శ్రవణ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు.. డబ్బులు పోగొట్టుకున్నానని మనస్తాపం చెంది ఉరేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.