టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో జడ్జిలపై ట్రోలింగ్ చేయటంపై క్రిమినల్ కంటెంప్ట్ కింద దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే ప్రతివాదులు 26 మందికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఐదుగురు ప్రతివాదుల ఆచూకీ గుర్తించటం కష్టంగా మారిందని కోర్టుకు అడ్వొకెట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లతో పోస్టింగ్ లు పెట్టినట్టు ఆయన కోర్టుకు వెల్లడించారు. జడ్జిలను దూషిస్తూ పెట్టిన పోస్టింగ్స్ ఫేక్ అకౌంట్స్ కావటంతో వారిని గుర్తించటం కష్టంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పడంతో.. మిగతా వారికి నోటీసులు ఇవ్వటానికి సమయం కావాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది. ఇక, కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 4 వారాల తర్వాత తదుపరి విచారణ చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ప్రకటించింది.
Read Also: India Alliance Meeting: ఇండియా కూటమి కీలక భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ!
అయితే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయన పిటిషన్లు విచారించిన జడ్జిలు, వారి కుటుంబీకులపై రాజకీయపరంగా ఉద్దేశపూర్వకంగా దూషణలతో కూడిన పోస్టింగ్స్ పెట్టడంతో వాటిని ఏపీ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు జడ్జి కుటుంబం టార్గెట్‌గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అయితే, జడ్జీలపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సర్కార్ సూచించింది.