NTV Telugu Site icon

Snake Viral video: కోపంలో కసిగా మరో పామును కాటు వేసిన భారీ పాము.. చూస్తే భయపడాల్సిందే

Snake

Snake

King Kobra Viral Video: సాధారణంగా చిన్నదైనా, పెద్దదైనా ఎలాంటిదైనా పామును చూస్తేనే మనం పారిపోతాం. అలాంటిదే మన ఇంట్లోనే పాములు ఎక్కడ పడితే అక్కడ ఉంటే, గోడల్లో మకాం పెట్టేస్తే పరిస్థితి ఎలా ఉంటుుంది చెప్పండి. ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదా. అలాగే బీహార్ లోని ఓ వ్యక్తి ఇంట్లో చాలా పాములు ఉంటున్నాయి. వాటిని ఏం చేయలేక అతను పాములను పట్టుకునే స్నేక్ సొసైటి సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు వచ్చి ఆ పాములను పట్టుకునే సమయంలో పాములు భయంకరంగా బుసగొడుతూ ఎంతో కోపంతో రగిలిపోయాయి. ఆవేశంలో ఓ పెద్ద పాము మరో పామును కాటు వేసింది. చూస్తుంటేనే భయంకరంగా ఒళ్లు గగుర్పొడిచే లా ఉండే ఆ వీడియో మురళీవాలే హౌస్లా అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది.

Also Read: Viral Video: భలే పిట్ట గురూ ఇది.. దొంగతనం చేసి యజమానికి ఇస్తున్న పక్షి

అసలు విషయానికి వస్తే బీహార్ కు చెందిన ఓ వ్యక్తి తమ ఇంట్లోకి పాములు వచ్చాయని అక్కడ ఉండాలంటేనే భయమేస్తుందని స్నేక్ సొసైటీ వారికి సమాచారం అందించాడు. ఆ పాములను ఇంట్లో నుంచి తరిమేయాలని వేడుకున్నాడు. దీంతో స్నేక్ సొసైటీ సభ్యుడు అతని ఇంటికి వచ్చాడు. రేకుల ఇళ్లు కావడంతో ఇటుకల మధ్య సంధుల్లో పాములు ఉన్నాయి. అయితే సొసైటీ సభ్యుడు టార్చ్ లైట్ వేసి అక్కడ రెండు పెద్ద పాములు గోడ మధ్యలో ఉన్నట్లు గుర్తించాడు. దీంతో గోడను పగుల గొట్టించిన అతడు పాములను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే ఆ పాములు బయటకు రాకుండా మొండికేశాయి.

దీంతో ఓ పొడుగాటి కర్రలాంటి పరికరంతో వాటిని బలవంతగా లాగాడు. చూడటానికి 10 అడుగుల పైగా ఉండే రెండు పాములు అక్కడ ఉన్నాయి. వాటి లాగుతుంటే అవి కోపంతో ఎంతో కసిగా బుసలు కొట్టాయి. కోపంలో ఓ పాము ఇంకో పామును బలంగా కాటేసింది. లాగుతున్నప్పుడు కూడా ఆ రెండు పాములు విడిపోకుండా ఒకదానికి ఒకటి పెనవేసుకునే ఉన్నాయి. ఆ స్నేక్ సొసైటీ సభ్యడు వాటని పట్టుకొని ఓ సంచిలో వేసుకొని అడవిలో వదిలిపెట్టాడు. అయితే ఆ గ్రామంలో పాములు ఎక్కువగా ఉన్నాయని వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు కోరారు. దీంతో ఆయన పాములకు ఎవరి మీద కోపం, పగ ఉండదని వాటికి హాని చేస్తారనే భయంతోనే అవి కాటేస్తాయని పాములు కనిపిస్తే వాటిని చంపకుండా తమ సమాచారం అందించాలని అవగాహన కల్పించారు. ఇక పాములు పట్టుకోవడాన్ని గ్రామస్తులందరూ దగ్గరుండి గమనించారు. వాటిని తమ ఫోన్లలలో వీడియో తీసుకున్నారు. నిజంగా ఈ వీడియో చూడటానికే ఎంతో భయంకరంగా ఉంది.