Site icon NTV Telugu

Rajanna Siricilla: బైకులోకి దూరిన పాము.. పార్ట్స్ అన్నీ ఊడదీసినా.. చివరకు

Sake

Sake

పాము.. ఆ పేరు వింటేనే ఒంట్లో వణుకు పడుతుంది. అలాంటిది తుప్పల్లో, పుట్టల్లో ఉండే పాములు ఇంట్లోకి వస్తే భయంతో పరుగులు తీయాల్సిందే. పాము కాటుతో ప్రాణాలకే ప్రమాదం. అప్పుడప్పుడు ఇళ్లలోకి చేరి హల్ చల్ చేస్తుంటాయి. ఇటీవలి కాలంలో షూస్, హెల్మెట్స్, బైక్ లలో పాములు దూరిన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బైకులోకి పాము దూరింది. ఈ విషయాన్ని గమనించిన బైక్ ఓనర్ మెకానిక్ షాప్ వద్దకు తీసుకు వచ్చాడు. బైక్ పార్ట్స్ అన్నీ ఊడదీసినా ఆ పాము మాత్రం కనిపించలేదు. కానీ, చివరకు ఇంజిన్ లో నుంచి బయటకు వచ్చింది.

Also Read:Rajanna Siricilla: బైకులోకి దూరిన పాము.. పార్ట్స్ అన్నీ ఊడదీసినా.. చివరకు

చందుర్తిలో ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి పాము దూరింది. ఎంతకూ బయటకు రాకపోవడంతో మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్లాడు. బైక్ లో దూరిన పామును బయటకు రప్పించేందుకు మెకానిక్స్ పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు. బైక్ ఒక్కో పార్ట్ ఊడదీస్తూ వెతకసాగారు. అలా దాదాపు బైక్ పార్ట్స్ అన్నీ ఊడదీశారు. అయినా కనిపించలేదు. చివరకు ఇంజిన్ నుంచి బయటకు వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Exit mobile version