Site icon NTV Telugu

Snake : హనుమకొండ పాఠశాలలో టాయిలెట్‌లో కొండచిలువ కలకలం

Python

Python

Snake : హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఓ పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థినులకు ఓ ఆందోళనకర అనుభవం ఎదురైంది. వారు రోజూ ఉపయోగించే టాయిలెట్‌లో ఓ భారీ కొండచిలువ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కమలాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) వసతిగృహంలోని టాయిలెట్‌లో దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ కనిపించింది. ఉదయం శుభ్రత పనులు జరుగుతున్న సమయంలో స్కూల్ సిబ్బంది ఈ దృశ్యాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు.

US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్

వెంటనే అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు అర్చన, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో విద్యార్థులను అక్కడి నుంచి దూరంగా తరలించారు. అనంతరం వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే హనుమకొండ జూ పార్క్‌కి చెందిన సిబ్బందితో పాటు బీట్ అధికారి అశోక్‌ అక్కడికి చేరుకుని, కొండచిలువను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీప్రాంతంలో వదిలివేశారు.

Body Found In Freezer: వెలుగులోకి మరో హనీమూన్ కేసు.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో శవం..

అటవీశాఖ సత్వర స్పందనతో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా పరిష్కారం కావడం స్థానికులను ఊపిరిపీల్చుకునేలా చేసింది. ఈ ఘటన విద్యార్థినుల మధ్య భయాందోళనను కలిగించినప్పటికీ, సిబ్బంది జాగ్రత్తతో తక్షణ చర్యలు తీసుకోవడం వల్ల అంతా క్షేమంగా ముగిసింది.

Exit mobile version