మన దేశంలో అధికంగా పండించే కూరగాయల పంటలో పొట్లకాయ కూడా ఒకటి.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇచ్చే ఈ పంటను రైతులు ఎక్కువగా పందిస్తున్నారు.. విత్తనాలను, అనువైన నేలలు, ఎలా సాగు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మాములుగా ఈ పొట్లకాయ లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ రంగులో రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి స్థానిక వాతావరణ పరిస్థితులు, భూసారం ఆధారంగా విత్తన రకాలను ఎంచుకోవాలి. ప్రధానంగా ఈ సాగుకు అధిక తేమ అవసరం.రసాయనాలతో పోలిస్తే సేంద్రియ ఎరువులతో సాగు చేసి మంచి పొట్లకాయ ప్రస్తుతం దేశమంతటా ఆదాయం పొందవచ్చు. ఈ సాగు విస్తృతంగా సాగుచేయబడుతోంది. చేయాలనుకునే రైతులు జనవరి రెండో వారం వరకూ విత్తుకోవచ్చు. వరుసల మధ్య 1.5-2 మీటర్ల దూరం, మొక్కల మధ్య 90 సెం.మీ దూరంలో పందిరి విధానంలో సాగు చేయండి. మల్చింగ్ విధానంలో సాగు చేస్తే సాగులోకి వస్తున్నప్పటికీ.. చీడల కలుపు కూడా నివారించవచ్చు.. ఇది ముఖ్యంగా చెయ్యాల్సిన పని..
ఇకపోతే పొట్లకాయను విత్తుకున్న 4 లేదా 5వ రోజు తేలికపాటి తడులు అందించాలి. ముఖ్యంగా కాయ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు నీటిని సమృద్ధిగా అందించాలి.. అప్పుడే త్వరగా తీగ పాకుతుంది.. మొక్క బాగుంటుంది.పొట్లకాయ విత్తుకోవడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటకు ఆశించే తెగులు, చీడలను కొంత వరకు నివారించవచ్చు. మీరు పందిరి విధానంలో సాగు చేస్తే ఒక్కో పాదుకు కనీసం 3-4 విత్తనాలను విత్తుకోండి. మీరు విత్తిన 10 రోజుల్లో మొలకెత్తుతాయి.. బలంగా ఉండే మొక్కను అక్కడ పాదులో ఉంచి మిగిలిన మొక్కలను పీకేయ్యాలి.మొక్క బాగా ఎదిగే సమయానికి పందిరికి అల్లించాలి.. సన్నని తీగల సాయంతో వాటిని పందిరికి అల్లించాలి.. గుమ్మడి పెంకు పురుగు, పండు ఈగ, పాము పొడ పురుగు ఆశించి నష్టం కలిగిస్తాయి. బూజు తెగులు, బూడిద తెగులు, వెర్రి తెగులు, ఆకు మచ్చ తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయి.. అందుకే తగిన చర్యలు తీసుకోవడం మంచిది.. ఈ పంట గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..