Site icon NTV Telugu

Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..!

Snake Video

Snake Video

Snake Bite: ఎప్పుడో ఒకచోట, ఎక్కడో ఒకచోట మనుషులను పాము కాటువేయడం వింటూనే ఉంటాము. అలాంటి సందర్భాలలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు కూడా. అయితే కొన్ని చోట్ల పాము కాటు వేసిన తర్వాత అదే పామును పట్టుకుని ఆస్పత్రికి వస్తుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటన మరోసారి వైరల్ గా ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి పోతే..

Mobile Charging Tips: దిండ్లు, దిప్పట్లపై మొబైల్‌ను పెడుతున్నారా?.. డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!

ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో ఓ ఈ-రిక్షా డ్రైవర్‌ను పని చేస్తున్న సమయంలో ఓ విషపూరిత పాము కాటేసింది. అయితే భయపడాల్సిన సమయంలో అతడు అసాధారణ ధైర్యం ప్రదర్శించాడు. కాటు వేసిన పామునే పట్టుకుని, తన జాకెట్ జేబులో పెట్టుకుని నేరుగా జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆ రిక్షా డ్రైవర్ జేబులో నుంచి బతికి ఉన్న పాము బయటపడటంతో ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

దీనితో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆస్పత్రి ప్రాంగణంలో పాము ఉండటం ప్రమాదకరమని భావించిన అధికారులు, చికిత్సకు ముందు పామును బయట వదలాలని లేదా సురక్షితంగా డబ్బాలో పెట్టాలని సూచించారు. అయితే దీనికి ఆ డ్రైవర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు వెంటనే చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు.

OnePlus Open 2: వన్‌ప్లస్ ఓపెన్ 2 లాంచ్ రద్దు?.. ఫోల్డబుల్ ఫోన్లపై వెనక్కి తగ్గిన కంపెనీ!

అంతే కాదు తన ఈ-రిక్షాను రోడ్డుపై అడ్డంగా నిలిపి ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆస్పత్రి బయట వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో డ్రైవర్ తీవ్ర ఉద్రిక్తతతో ఆస్పత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కనిపించాడు. “నేను అరగంట క్రితమే వచ్చాను, అయినా చికిత్స చేయడం లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్‌ను శాంతింపజేసి, పామును ఆస్పత్రి పరిసరాల నుంచి తొలగించిన అనంతరం అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం మథురాలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version