Site icon NTV Telugu

Tragedy : అంత్యక్రియలకు వచ్చి… అంత్యమైన చిన్నారి జీవితం

Tragedy

Tragedy

Tragedy : జీవితంలోని విషాదం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. పుట్టింట్లో బంధువుల కార్యక్రమానికి వచ్చిన ఓ చిన్నారి, ఇంటి ముందు ఆడుకుంటూ విషపూరిత పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య-లలిత దంపతుల పెద్ద కుమార్తె స్నేహాన్షి (4) తల్లి లలితతో కలిసి చిన్నలింగాపూర్ గ్రామానికి వచ్చింది. అక్కడ వారి బంధువు సంవత్సరీకానికి, మరొక బంధువు మృతికి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.

Indian Envoy: ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందే!

రాత్రి 9 గంటల ప్రాంతంలో స్నేహాన్షి ఇంటి బయట ఆడుకుంటుండగా పాము కాటుకు గురైంది. అచ్చం ఆ సమయంలో ఎవరికీ తెలియకపోయినా, కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాపను గమనించిన బంధువులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలిస్తున్న మార్గంలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబ సభ్యులు పాప మరణాన్ని జీర్ణించుకోలేక బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Exit mobile version