NTV Telugu Site icon

BSF: స్మగ్లర్లు LOC వెంబడి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు

Drones

Drones

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.

Storage Of Grains: ధాన్యం నిల్వలో ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

డ్రోన్‌ల కదలికలను తనిఖీ చేయడానికి తాము SOPని అభివృద్ధి చేసామని.. అందుకోసం BSF సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు యోగేష్ తెలిపారు. అంతేకాకుండా.. డ్రోన్ సాంకేతికతతో బాగా ప్రావీణ్యం ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. నిఘా పెంచడంతో స్మగ్లర్లు పెద్ద పెద్ద డ్రోన్లను వాడడం మానేశారన్నారు. స్మగ్లర్లు ఇంతకుముందు మూడు నుంచి ఐదు కిలోల వరకు పేలోడ్‌లను మోసుకెళ్లగల భారీ లిఫ్ట్ డ్రోన్‌లను ఉపయోగించేవారని యోగేష్ బహదూర్ ఖురానియా చెప్పారు. ప్రస్తుతం 400 నుంచి 500 గ్రాముల పేలోడ్ సామర్థ్యం ఉన్న చిన్న డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని, వాటి ధర మధ్యస్థంగా ఉందని ఆయన చెప్పారు.

Pawan Kalyan: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..

చిన్న డ్రోన్‌లను గుర్తించడం కష్టమే.. కానీ ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి BSF సిద్ధంగా ఉందని యోగేష్ బహదూర్ తెలిపారు. పంజాబ్ పోలీసుల కమాండ్‌ను మెచ్చుకున్న బీఎస్‌ఎఫ్ స్పెషల్ డీజీ.. పోలీసుల సహకారం వల్లే బీఎస్‌ఎఫ్ సరిహద్దులోని సున్నితమైన ప్రాంతాలను గుర్తించగలిగామని చెప్పారు. మరోవైపు.. గ్రే ఏరియాల జాబితాను రూపొందించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, 2024 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఫెన్సింగ్ విస్తీర్ణం పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని, దానిని అమలు చేస్తామన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో అక్రమ మైనింగ్‌ను నిలిపివేసినట్లు బీఎస్‌ఎఫ్‌ డీజీ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Show comments