Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- వన్డే క్రికెట్ చరిత్రలోనే రెండో బ్యాటర్‌గా రికార్డు
- ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో స్మృతి 50 బంతుల్లో శతకం చేసి ఈ ఫీట్ సాధించింది. వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పిన స్మృతి.. తొలి భారత బ్యాటర్‌గా తన రికార్డును మెరుగుపరుచుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన స్మృతి 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
మూడో వన్డేలో స్మృతి మంధాన మొదటి నుంచే హిట్టింగ్ చేసింది. ఈ క్రమంలో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 బంతుల్లో సెంచరీ చేసింది. దాంతో 57 బంతుల్లో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు కారెన్ రోల్టన్, బెత్ మూనీ పేరిట ఉన్న రికార్డును స్మృతి బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ సెంచరీ రికార్డ్ ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లాన్నింగ్ పేరిట ఉంది. 2013లో సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో సెంచరీ చేసింది. ఈ జాబితాలో ప్రస్తుతం స్మృతి రెండో స్థానంలో ఉంది. స్మృతి గతంలో 70, 77 బంతుల్లో శతకం బాదింది. హర్మన్ ప్రీత్ కౌర్ 82 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
Also Read: Hardik Pandya: అనవసర హైప్ వద్దు.. పాకిస్థాన్‌తో ఆడబోయేది మామూలు మ్యాచే!
మహిళల వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీలు:
45- మెగ్ లానింగ్ vs న్యూజిలాండ్, నార్త్ సిడ్నీ ఓవల్, 2012
50- స్మృతి మంధాన vs ఆస్ట్రేలియా, ఢిల్లీ, 2025*
57- కరెన్ రోల్టన్ vs దక్షిణాఫ్రికా, లింకన్, 2000
57- బెత్ మూనీ vs ఇండియా, ఢిల్లీ, 2025*
59- సోఫీ డివైన్ vs ఐర్లాండ్, డబ్లిన్, 2018
60- చమరి అటపట్టు vs న్యూజిలాండ్, గాలే, 2023
మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు:
15 – మెగ్ లానింగ్
13 – సుజీ బేట్స్
13 – స్మృతి మంధాన
12 – టామీ బ్యూమాంట్
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!