NTV Telugu Site icon

Smriti Mandhana: నా ఫేవరేట్ క్రికెటర్ అతడే: స్మృతి మంధాన

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana About Virat Kohli: టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకు ఫేవరేట్ బ్యాటర్ అని తెలిపారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోహ్లీని తాను కలిశానని, అతడి నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వెల్లడించారు. కోహ్లీ, స్మృతిలు ఐపీఎల్‌ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మలను కాదని కోహ్లీని స్మృతి మంధాన ఎంచుకున్నారు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో స్మృతి మంధాన పాల్గొనగా.. ఫేవరేట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ‘విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ క్రికెటర్. కోహ్లీని నేను కలిసినపుడు అతడి బ్యాటింగ్, మైండ్ సెట్ గురించి అడిగాను. బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు ఏమి ఆలోచిస్తారు?, మీపై ఉండే ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు? అని అడిగా. అంచనాల గురించి అస్సలు పట్టించుకోనని, జట్టుకు ఏం కావాలో దాని గురించే ఆలోచిస్తానని విరాట్ నాతొ చెప్పాడు. అది విన్న తర్వాత నా మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది’ అని స్మృతి చెప్పుకొచ్చారు.

Also Read: BSNL 5G Network: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌పై కీలక అప్‌డేట్‌!

ప్రస్తుతం స్మృతి మంధాన టీ20 ప్రపంచకప్‌కు సిద్దమవుతున్నారు. రేపటి నుంచి ఎన్సీఏలో భారత జట్టు 10 రోజుల శిక్షణ శిబిరం మొదలుకానుంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలపడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గ్రూప్ దశలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ ఆడతాయి.