Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Smriti Mandhana Renuka Thakur Singh Help India Women Won By 211 Runs Against West Indies Women

IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!

Published Date :December 23, 2024 , 7:24 am
By Sampath Kumar
  • మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ బోణీ
  • మెరిసిన స్మృతి, రేణుక
  • 211 పరుగుల తేడాతో ఘన విజయం
IND vs WI: మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్‌ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్‌ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 24న భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91; 102 బంతుల్లో 13×4), ప్రతీక రావల్‌ (40; 69 బంతుల్లో 4×4)లు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రావల్‌ అనంతరం హర్లీన్‌ డియోల్‌ (44) దూకుడుగా ఆడింది. సెంచరీ చేసేలా కనిపించిన స్మృతి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీగా వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34), రిచా ఘోష్‌ (26), జెమీమా రోడ్రిగ్స్‌ (31) రాణించడంతో భారత్ స్కోరు 300 దాటింది. విండీస్‌ బౌలర్లలో జైదా జేమ్స్‌ (5/45) ఐదు వికెట్స్ తీసింది.

Also Read

  • Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్‌ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
  • Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
  • Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
  • UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
Add as a preferred
source on google

భారీ ఛేదనలో విండీస్ ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే ఓపెనర్‌ కియానా జోసెఫ్‌ రనౌట్‌ అయింది. రేణుక సింగ్ చెలరేగడంతో 26 పరుగులకే 5 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. షిమైన్‌ క్యాంప్‌బెల్‌ (21), అఫీ ఫ్లెచర్‌ (24), అలియా (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో రేణుకతో పాటు ప్రియ మిశ్రా (2/22), దీప్తిశర్మ (1/19) రాణించారు. వన్డేల్లో పరుగుల పరంగా భారత్‌కు ఇది రెండో పెద్ద విజయం. అంతకుందు 2017లో ఐర్లాండ్‌పై 249 పరుగుల తేడాతో గెలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India Women vs West Indies Women
  • INDW vs WIW
  • Renuka Thakur Singh
  • smriti mandhana
  • Team India

తాజావార్తలు

  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!

  • Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్‌ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!

  • Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..

  • Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!

  • Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్‌గా కరకరలాడే వడలు

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions