భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జింబాబ్వే సిరీస్‌కు ముందు జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశారు. ఆమె స్థానంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. గువాహటిలో జరిగిన బీసీసీఐ సమీక్ష సమావేశం తర్వాత హర్మన్‌ప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా స్మృతి మంధాన మాజీ కెప్టెన్ గురించి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్టు చేశారు. తమ దశాబ్ద కాలపు నాయకత్వంలో హర్మన్‌ప్రీత్ దేశానికి అద్భుత విజయాలను అందించారని మంధాన కొనియాడారు. నవంబర్ 2025లో తొలి వన్డే ప్రపంచ కప్‌తో పాటు 2023, 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిపెట్టడంలో ఆమె పాత్ర గొప్పదని ప్రశంసించారు. ఆట పట్ల ఉన్న మళ్లీ కేవలం ప్రేమ, అభిరుచితోనే ఆడాలని భావిస్తున్నట్లు హర్మన్‌ప్రీత్ తెలిపారు. కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ, ఆమె జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన జట్టులో కొనసాగనున్నారు.
మరోవైపు, గాయంతో జట్టుకు దూరంగా ఉన్న జెమిమా రోడ్రిగ్స్ కూడా హర్మన్‌ప్రీత్ సేవలలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల చివర్లో జింబాబ్వేతో జరిగే దేశీయ టీ20, వన్డే సిరీస్‌ల ద్వారా స్మృతి మంధాన పూర్తి స్థాయి కెప్టెన్‌గా తన బాధ్యతలను ప్రారంభించనున్నారు.

