Site icon NTV Telugu

Smriti Mandhana: రికార్డుల రారాణి స్మృతి మంధాన.. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి..!

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక నాలుగో టీ20లో టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా మంధాన నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా. భారత్ తరఫున ఈ జాబితాలో మిథాలీ రాజ్ 10,868 పరుగులతో ముందుంది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 10,652 పరుగులు, షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) 10,273 పరుగులతో మంధాన కంటే ముందున్నారు.

LG 5K Monitor: టీవీని మించిన ‘మినీ’ విజువల్.. 5K మెరుపులతో LG మానిటర్ వస్తుంది!

స్మృతి మంధాన ఈ మైలురాయిని కేవలం 281 ఇన్నింగ్స్‌లలోనే సాధించింది. ఈ ఘనతను అత్యంత వేగంగా చేరుకున్న మహిళగా రికార్డు సృష్టించింది. ఈ రికార్డును మిథాలీ రాజ్ 291 ఇన్నింగ్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్ 308 ఇన్నింగ్స్, సుజీ బేట్స్ 314 ఇన్నింగ్స్ లలో సాధించారు. తిరువనంతపురంలో జరిగిన భారత్, శ్రీలంక నాలుగో టీ20 మ్యాచ్ కు ముందు మంధాన 10,000 పరుగులకు 27 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్‌లో నిమాషా మీపేజ్ బౌలింగ్‌లో లాంగ్-ఆన్ వైపు సింగిల్ తీసి ఆమె ఈ మైలురాయిని అందుకుంది.
TTD Alert: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం.. తిరుమలలో భారీ బందోబస్తు..!

2025 ఏడాది మంధానకు అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డ్ సాధించింది. 2025లో 1362 వన్డే పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఈ ఏడాది 5 వన్డే సెంచరీలు సాధించింది. మరోవైపు టీ20ల విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లోనే మంధాన మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 4,000 పరుగులు పూర్తి చేసిన రెండో మహిళగా నిలిచింది. ఈ జాబితాలో ముందున్నది సుజీ బేట్స్ (4,716 పరుగులు) మాత్రమే ముందుంది. ఇక నాలుగో టీ20లో మంధాన అద్భుతంగా ఆడి 48 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఆమెతో పాటు షెఫాలి వర్మ (79) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో 221/2 భారీ స్కోరు నమోదు చేసింది.

Exit mobile version