Smriti irani: బెంగాల్లో బీజేపీ నేతపై దాడి.. టీఎంసీపై కేంద్రమంత్రి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలే దాడి చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకురాలి తలకు గాయమై రక్తస్రావం అవుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..

శనివారం సరస్వతి సర్కార్‌పై కొందరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ గూండాలే కారణమని బీజేపీ ఎంపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. ఇది అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ఘటనను మరువక ముందే.. బీజేపీ మహిళా నేతకు ఇలా జరగడం చూస్తుంటే.. వణుకు పుడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ కోల్‌కతాలో దేబశ్రీ చౌధురి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు.
ఇది కూడా చదవండి: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు.. ప్రమాదంలో స్కూల్స్, కాలేజీలు
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా వైఫల్యం చెందారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో రాష్ట్రం అట్టుడికింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపీ మహిళా నేతపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
Protest at Anandapur Police Station against brutal attack by @MamataOfficial TMC G00ns on Kasba Mondal President.
Officer-in-charge of Anandapur PS is missing, they have to arrest culprits who attacked Saraswati Sarkar. pic.twitter.com/DpiD4WgNj7
— Debasree Chaudhuri (@DebasreeBJP) April 28, 2024
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!