Site icon NTV Telugu

Smriti irani: బెంగాల్‌లో బీజేపీ నేతపై దాడి.. టీఎంసీపై కేంద్రమంత్రి ఆగ్రహం

Teee

Teee

పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా నేత సరస్వతి సర్కార్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలే దాడి చేశారని ఆమె ఆరోపించారు. బీజేపీ నాయకురాలి తలకు గాయమై రక్తస్రావం అవుతున్న వీడియో వైరల్‌గా మారింది.

 

 

శనివారం సరస్వతి సర్కార్‌పై కొందరు భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ గూండాలే కారణమని బీజేపీ ఎంపీ అభ్యర్థి దేబశ్రీ చౌధురి ఆరోపించారు. ఇది అత్యంత క్రూరమైన చర్యగా అభివర్ణించారు. సందేశ్‌ఖాలీ ఘటనను మరువక ముందే.. బీజేపీ మహిళా నేతకు ఇలా జరగడం చూస్తుంటే.. వణుకు పుడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ కోల్‌కతాలో దేబశ్రీ చౌధురి ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు.

ఇది కూడా చదవండి: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు.. ప్రమాదంలో స్కూల్స్, కాలేజీలు

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా వైఫల్యం చెందారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే సందేశ్‌ఖాలీ ఘటనతో రాష్ట్రం అట్టుడికింది. తాజాగా సార్వత్రిక ఎన్నికల వేళ.. బీజేపీ మహిళా నేతపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Exit mobile version