NTV Telugu Site icon

Amazon Smart TV Offers: 56 శాతం డిస్కౌంట్‌.. 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌ టీవీ!

Amazon Smart Tv Offers

Amazon Smart Tv Offers

Smart TV Discounts on Amazon: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’ ఏటా నిర్వహించే ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ సేల్‌ను సెప్టెంబర్‌ 27న ఆరంభించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. మీరు స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటే.. ఇదే మంచి అవకాశం. కొన్నింటిపై ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌ ఉంది. బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతో తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్‌ టీవీని ఇంటికితీసుకెళ్లిపోవచ్చు.

టీసీఎల్ ఎల్4బీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ.35,990గా ఉంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఈ టీవీపై 56 శాతం డిస్కౌంట్‌ ఉంది. దాంతో రూ.15,990కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా రూ.4000 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దాదాపుగా 12 వేలకే ఈ 40 ఇంచెస్ స్మార్ట్‌ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. వీయూ 50 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ.50,000 కాగా.. సేల్‌లో 36 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ.31,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు.

Also Read: IND vs BAN: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆలౌట్‌.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!

షావోమీ 55 ఇంచెస్‌ టీవీ అసలు ధర రూ. 54,999 కాగా.. అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌ ఉంది. దాంతో రూ. 35,999కే మీరు సొంతం చేసుకోవచ్చు. కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. సోనీ బ్రేవియా 3 సిరీస్ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 1,29,900 కాగా.. 42 శాతం డిస్కౌంట్‌ అనంతరం రూ.75,990కి లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.4 వేల వరకు డిస్కౌంట్‌ వస్తుంది. ఏసర్ అల్ట్రా క్యూఎల్‌ఈడీ 43 ఇంచెస్ స్మార్ట్‌ టీవీని రూ.26,999కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్స్ అదనం.

Show comments