Site icon NTV Telugu

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత

Slbc Tunnel

Slbc Tunnel

SLBC Tunnel: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గత 63 రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది, మిగిలిన ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, టన్నెల్‌లో నిరంతరం పనిచేసిన ఎక్స్‌కవేటర్లు గురువారం బయటకు వచ్చాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినప్పటికీ, ప్రమాదకరమైన జోన్‌లో మాత్రం ఇంకా తొలగించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు, సహాయక చర్యలను మూడు నెలల పాటు నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టులో ఫిబ్రవరి 22న దుర్ఘటన సంభవించిన విషయం తెలిసిందే.

Bandi Sanjay : పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలుంటాయ్

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలను నిలిపివేయాలని సాంకేతిక కమిటీ నిర్ణయానికి వచ్చింది. టన్నెల్ యొక్క ఇన్లెట్ వైపు నుండి 13.6 కిలోమీటర్ల తర్వాత ముందుకు వెళ్లడం సురక్షితం కాదని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు, గురువారం జలసౌధలో రెవెన్యూ శాఖ (విపత్తులు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఏపీలోని ఎన్‌డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్, నేషనల్ జియోఫిజికల్ పరిశోధనా సంస్థ డైరెక్టర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ భూశాస్త్రవేత్త , బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) నుండి టన్నెల్ నిపుణులు పరీక్షిత్ మెహ్రా పాల్గొన్నారు. వారి సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vijayawada: ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను ట్రాప్ చేసి.. డబ్బు, బంగారం కాజేసిన కిలాడీ అరెస్ట్..

Exit mobile version