NTV Telugu Site icon

SL vs IND: సీఎస్‌కే తరఫున ఆడాకే గుర్తింపు వచ్చింది.. శ్రీలంక పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Matheesha Pathirana On Csk

Matheesha Pathirana On Csk

Matheesha Pathirana Says Sharing the dressing room with MS Dhoni is very special: ఐపీఎల్ ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడాకే తనకు గుర్తింపు వచ్చిందని శ్రీలంక యువ పేసర్ మతీశా పతిరన తెలిపారు. చెన్నై తరఫున ఆడటం దేవుడిచ్చిన బహుమతిగా భావిస్తున్నా అని తెలిపాడు. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం తన అదృష్టం అని పతిరన పేర్కొన్నాడు. యువ మలింగగా గుర్తింపు పొందిన పతిరన.. చెన్నై తరఫున ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. అనతికాలంలోనే సీఎస్‌కే కీలక బౌలర్‌గా ఎదిగాడు. దీంతో అతడికి శ్రీలంక టీమ్‌లో చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో పతిరన ఫర్వాలేదనిపించాడు.

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ కోసం మతీశా పతిరన సిద్దమవుతున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అండర్-19 తర్వాత ఏ జట్టులో కూడా నాకు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడాక జాతీయ జట్టులో అవకాశం వచ్చింది. చెన్నై తరఫున ఆడటం దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తా. సీఎస్‌కేలో ఆడకముందు వరకు నా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ధోనీతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న తర్వాత.. చెన్నై ఆడిన ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నించా. ఆ తర్వాత గుర్తింపు లభించింది. నాలాంటి కుర్రాళ్లకు ధోనీతో పరిచయం చాలా ప్రత్యేకం’ అని పతిరన అన్నాడు.

Also Read: Telangana Budget 2024: త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ.. వరి సన్నాలకు రూ.500 బోనస్: డిప్యూటీ సీఎం

‘నా బౌలింగ్‌ను చూసి చాలా మంది డెత్‌ ఓవర్లలో అద్భుతంగా వేస్తున్నావని ప్రశంసించారు. కొత్త బంతితో పాటు మిడిల్ ఓవర్లలోనూ మెరుగైన బౌలర్‌గా మారాలి. కొత్త బంతితో స్వింగ్ రాబట్టగలిగితే.. నాకే కాదు నేను ఆడే జట్టుకూ మంచి జరుగుతుంది. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించట్లేదు. నిలకడగా ఒకేచోట బంతిని వేయడంపై దృష్టి సారిస్తా. సరైన లెంగ్త్‌తో పాటు స్వింగ్‌ రాబడితే చాలు. అంతకు మించి నాకేం అవసరం లేదు’ అని మతీశా పతిరన చెప్పాడు.