Site icon NTV Telugu

రైతుల డిమాండ్ల పై నేడు ఎస్‌కేఎం కార్యాచరణ

2021 నవంబర్‌ 21 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఎస్‌కెఎం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్‌ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది. ఈ నెల 7న సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం అవుతుందని, భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఏడాదిగా రైతు ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్న ఢిల్లీ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న పౌరులకు కృతజ్ఞతలు తెలియజేసింది.

రైతులకు వ్యతిరేకంగా పాలకపక్షం, మీడియా నిరంతరం రెచ్చగొడుతున్నా మద్దతిస్తున్న వారంతా ఎప్పటికీ అన్నదాతలకు గుర్తుండిపోతుందని ఎస్‌కెఎం స్పష్టం చేసింది. ఇప్పటికే ఏడాదిగా రైతులు ఉద్యమంతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. అయినా మరికొన్ని డిమాండ్లను నేరవేర్చాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర ప్రభుత్వాన్ని పట్టు పడుతోంది. ఇవాళ్టి కార్యచరణలో రైతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

Exit mobile version