NTV Telugu Site icon

ISKCON Biggest Cheat: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..

Maneka Gandhi

Maneka Gandhi

ISKCON Biggest Cheat: ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ మేనకా గాంధీ. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం.. ఆవుల షెడ్లను నడుపుతూ ప్రభుత్వం నుండి భారీగా భూములతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతున్నారన్న ఆమె.. ఇస్కాన్‌లో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని విమర్శించారు. ఇక్కడ గోవులను గోశాల నుంచి బయటకు తీసి కసాయిలకు విక్రయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మేనకా గాంధీ. అయితే, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించింది ఇస్కాన్.

కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ.. జంతు హక్కుల పరిరక్షణలో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం అని ఆమె ఆరోపించారు. ‘ఆవు షెడ్లను నడుపుతోంది మరియు భారీ భూములతో సహా ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను పొందుతుంది’ కానీ, మోసం చేస్తోందని ఆరోపించారు.. ఒక మీడియా కథనం ప్రకారం, బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్‌లోని ఆవు షెడ్ గురించి ప్రస్తావించారు. తాను ఇస్కాన్‌కు చెందిన అనంతపురం గోశాలకు వెళ్లానని, అక్కడ పాలు ఇవ్వని ఒక్క ఆవు కూడా కనిపించలేదు.. అలాగే డెయిరీ మొత్తంలో ఒక్క దూడ లేదు. పాడిపరిశ్రమలో పాలు ఇవ్వని ఒక్క ఆవులు లేవు.. ఒక్క దూడ కూడా లేదంటే అవి అన్నీ అమ్మేసినట్టే కదా? అన్నారు.

ఇస్కాన్‌ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోందని ఆరోపించారు మేనకా గాంధీ.. ఈ పనిని వాళ్లు చేసినంతగా ఎవరూ చేయరు అని మండిపడ్డారు.. వీధుల్లో ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. దీని తరువాత వారి జీవితమంతా పాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. బహుశా వీరు అమ్మినన్ని ఆవులను కసాయిదారులకు మరెవరూ అమ్మి ఉండరని పేర్కొన్నారు. అయితే, మేనకా గాంధీకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ దాదాపు నెల రోజుల క్రితం అయినట్టు సమాచారం. ‘మదర్స్ మిల్క్’ పేరుతో డాక్యుమెంటరీ తీసిన డాక్టర్ హర్ష ఆత్మకూరి.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక, ఆవులను కసాయిదారులకు విక్రయిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్‌ స్పందించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో ఇస్కాన్‌ అగ్రగామిగా ఉందని ప్రకటించింది ఇస్కాన్.