ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ”స్కంద”..బోయపాటి సినిమా అంటేనే ఫుల్ ఊర మాస్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తారు.మరి అలాంటి బోయపాటితో రామ్ సినిమా అంటే థియేటర్స్ దద్దరిళ్లేలా ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ భారీగా ఉహించుకుంటున్నారు…ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే భారీ అంచనాలు వున్న ఈ సినిమా సెప్టెంబర్ 15 న వినాయక చవితి కానుకగా విడుదల కానుంది..అయితే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు.. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు బాలయ్య గెస్ట్ గా హాజరయ్యి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసారు.అయితే ఈ ట్రైలర్ పై ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి..
బోయపాటి సినిమాలన్నీ ఇంచుమించు అన్ని ఒకేలా ఉంటాయని ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు… రెండు కుటుంబాల మధ్య పగ.. ఆ పగ కోసం చంపుకోవడం మధ్యలో కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.ఇలా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ వినయ విధేయ రామ మాత్రం రాంచరణ్ కు భారీ షాక్ ఇచ్చింది.. ఆ తర్వాత అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పుడు రామ్ తో చేస్తున్న స్కంద సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.ట్రైలర్ చూసాక డైలాగ్స్ పవర్ ఫుల్ గా యాక్షన్ అంతకంటే ఎక్కువుగా కనిపించింది..అయితే ఈ సినిమా కూడా బోయపాటి పాత సినిమాల లాగానే ఉంది అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు..అలాగే బోయపాటి గారు మీరు ఇంక మారరా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే కంటెంట్ బాగుంటే కనుక ఎన్నిసార్లు రిపీట్ చేసిన హిట్ అవ్వడం ఖాయం అని కొంత మంది ఆయనకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి స్కంద సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.