ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద..మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు. ఈ సినిమాకు ముందు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. అయితే వరుసగా వచ్చిన సెలవులు స్కంద సినిమా కు బాగా ఉపయోగపడ్డాయి తెలుగు రాష్ట్రాలలో స్కంద సినిమా మొదటి రోజు దాదాపు రూ. 8.52 కోట్లు, రెండవ రోజు రూ. 3.50 కోట్లు అలాగే మూడవ రోజు రూ.3.27 కోట్లు వసూలు చేసింది. అయితే ఆదివారం స్కంద వసూళ్లు కాస్త పెరిగాయి.. స్కంద నాలుగో రోజు రూ.4.46 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు స్కంద రూ.19.85 కోట్ల షేర్, 32.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 23.40 కోట్ల షేర్, 39.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఐదవ రోజు స్కందకు నైజాంలో కోటి కంటే తక్కువ షేర్ నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.1.5 కోట్ల వరకూ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ చూస్తే ఈ సినిమా రూ. 3 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కంద ఐదు రోజుల కలెక్షన్స్ రూ. 22 కోట్ల వరకూ ఉండొచ్చని అయితే అంచనా. ఇక వరల్డ్ వైడ్ రూ. 25 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్కంద చిత్రం దాదాపు రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హీరో రామ్,బోయపాటి శ్రీనుపై నమ్మకంతోభారీగా బిజినెస్ జరిగింది. రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన స్కంద రాబట్టాల్సిన వసూళ్లు చాలా ఉన్నాయి. మరో రూ. 22 కోట్ల వసూళ్లు రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుంది.. అయితే వర్కింగ్ డేస్ లో వసూళ్లను బట్టి ఈ చిత్ర ఫలితం తెలియనుంది.