Site icon NTV Telugu

SJ Suryah: దీనమ్మ.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటున్న సూర్య

Surya

Surya

SJ Suryah About Gamechanger: నటుడు ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా నుండి తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఇకపోతే, ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడుగా, క్రీజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో గేమ్ చేంజెర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara adwani), అంజలీలు కథానాయకలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిర్మాణాంతర కార్యక్రమాలు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ఎస్ జె సూర్య చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ సూర్య ఆ పోస్టులో ఏం రాసుకోచ్చాడంటే..

Also Read: Rocking Rakesh: ‘కెసిఆర్’ సినిమాలో కెసిఆర్ నటించారు.. టికెట్ రేట్స్ తగ్గించాం: హీరో రాకింగ్ రాకేష్

ఇప్పుడే డబ్బింగ్ పూర్తయిందని.. గేమ్ చేంజర్ అనే రెండు కీలక సన్నివేశాలు చాలా ఇబ్బంది పెట్టాయని చెప్పుకొచ్చాడు. ఇందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మరొకటి నటుడు శ్రీకాంత్ తో చేసిన రెండు కీలక సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పడానికి తనకు మూడు రోజులు సమయం పట్టిందని రాసుకోచ్చాడు. ఇకపోతే, ఇందుకు సంబంధించిన అవుట్ పుట్టు చూస్తే.. “దిమ్మ.. తిరిగి బొమ్మ కనపడిందంటూ” తెలియజేశాడు. థియేటర్లో సినిమా చూస్తే ప్రేక్షకుడు పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తాడని.. “పోతారు మొత్తం పోతారు” అంటూ తెలిపారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశాడు. చివరిలో ‘రామ్‌’పింగ్‌ సంక్రాంతికి కలుద్దాం’’ అని రాసుకొచ్చారు.

Exit mobile version