Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో ఆరుగురు రష్యా పౌరులు అరెస్ట్..

Tn Police

Tn Police

తమిళనాడు పోలీసులు ఆరుగురు రష్యా పౌరులను అరెస్ట్ చేశారు. కుడంకుళం వద్ద ఉన్న న్యూక్లియర్‌ రియాక్టర్‌ ప్లాంట్‌ దగ్గర నుంచి ఆరుగురు రష్యన్‌ పౌరులు, ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ పరిసరాల్లో విదేశీయులు ఉన్నారని స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు IANSకి తెలిపారు.

Read Also: Team India: శ్రీలంక చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో

ఒక మహిళతో పాటు ఆరుగురు రష్యన్లు, ఇద్దరు తమిళనాడు స్థానికులు.. తిరువనంతపురం నుండి ఒక కేరళీయుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న వారిని కేంద్ర ఏజెన్సీలు ప్రశ్నించడం ప్రారంభించాయని తమిళనాడు పోలీసు వర్గాలు తెలిపాయి. దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి వద్ద కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్ట్ రష్యన్ల మద్దతుతో ప్రారంభించారు. 2022 మార్చిలో నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు ప్లాంట్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూడంకుళంలో రష్యా సహాయంతో నిర్మించిన రెండు 1,000 మెగావాట్ల అణు రియాక్టర్లు ఉన్నాయి. ఇదే కాంప్లెక్స్‌లో మరో నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read Also: DMK Leader: శ్రీరాముడు ‘ద్రవిడ నమూనా’ని ముందుకు తీసుకెళ్లాడు.. డీఎంకే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..

Exit mobile version