Site icon NTV Telugu

Chhattisgarh: నారాయణాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి..

Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత, ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47/ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను , నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.

Read Also: PM Narendra Modi: బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు, దోషులను తృణమూల్ రక్షిస్తోంది..

ఓవైపు లొంగుబాట్లు, మరోవైపు ఎన్‌కౌంటర్‌లతో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దశ అంతానికి వచ్చింది. ఆపరేషన్ కగార్‌తో భద్రతా బలగాలు మావోయిస్టుల్ని తుడిచిపెడుతున్నాయి. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ నెల ప్రారంభం లో ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో ఏకంగా రూ. 1.18 కోట్ల బహుమతి ఉన్న 23 మందిన నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 11 మంది సీనియర్ కేడర్లు, 9 మంది మహిళలు ఉన్నారు.

Exit mobile version