NTV Telugu Site icon

Breaking News: విషాదం.. సరస్సులో పడవ మునిగి పలువురు విద్యార్థులు మృతి

Gujarat

Gujarat

గుజరాత్‌లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా.. గల్లంతైన వారు ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న డోదర కలెక్టర్ ఏబీ గౌర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పడవలో 27 మంది చిన్నారులు ఉన్నారని.. సరస్సులో మునిగిపోయిన చిన్నారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Show comments