Site icon NTV Telugu

IASs : తెలంగాణలో ఆరుగురు ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌లు రిలీవ్‌… వారి స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు

Cs Shanti Kumari

Cs Shanti Kumari

తెలంగాణలో ప్రభుత్వంలో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మార్పుల ప్రకారం, పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా, ప్రభుత్వం నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల స్థానాలు భర్తీ చేయడానికి ఇన్‌చార్జులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రిలీవైన IASల అధికారుల స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలి స్థానంలో GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, వాకాటి కరుణ స్థానంలో ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా శ్రీదేవి, రోనాల్డ్‌ రోస్‌ స్థానంలో ఎనర్టీ సెక్రటరీగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, వాణీ ప్రసాద్‌ స్థానంలో టూరిజం అండ్‌ కల్చర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఎన్‌,శ్రీధర్‌, ప్రశాంతి స్థానంలో ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినా, ఆరోగ్యశ్రీ సీఈవోగా ఆర్‌.వి.కర్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Cabinet Committees: ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం కేబినెట్ కమిటీలు..

క్యాట్, తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఐఏఎస్ లు గుమ్మడి సృజన, శివశంకర్ సీఎస్ శాంతికి రిపోర్ట్ చేశారు. సీఎస్ ను కలిసి జాయినింగ్ రిపోర్టు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాణి ప్రసాద్‌, వాకాటి కరుణలను తెలంగాణ ప్రభుత్వం బుధవారం సాయంత్రం రిలీవ్‌ చేసింది. దీంతో ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా రిపోర్ట్‌ చేయనున్నారు. ఈ అధికారులు ఏపీకి వెళ్లాల్సిందేని డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను క్యాట్‌, తెలంగాణ హైకోర్టు సమర్థించడంతో వీరు తెలంగాణను వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. రిలీవ్‌ అయిన నలుగురు ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జి అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

Exit mobile version