NTV Telugu Site icon

Sitaram Yechury: బాల్యం మొత్తం హైదరాబాద్లోనే.. సీతారాం ఏచూరి జీవిత విశేషాలు

Siraram Passed Away

Siraram Passed Away

కమ్యూనిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సీతారాం ఏచూరి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం. సీతారాం ఏచూరి తండ్రి ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం చేసేవాడు.. ఆయన తల్లి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. 1992 నుంచి ఏచూరి సీపీఎంలో పొలిట్‌బ్యూరో సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత.. 2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సీతారాం ఏచూరి బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. ఆయన హైదరాబాద్‌లోని ఆల్‌సెయింట్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఏచూరి ఢిల్లీకి చేరారు. సీతారాం ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్ స్కూల్‌లో 12వ తరగతి, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్, జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌లో గోల్డ్‌ మెడల్ సాధించారు.

Read Also: Sukumar- Dil Raju: నేనున్నా.. దిల్ రాజుకు సుక్కూ అభయం!

1974లో ఎస్‌ఎఫ్‌ఐలో చేరిన ఏచూరి.. 1975 ఎమర్జెన్సీ టైమ్‌లో అరెస్ట్ కావడంతో స్టడీకి ఫుల్‌స్టాప్ పెట్టారు. మరోవైపు.. ఎమర్జెన్సీ టైమ్‌లో ఏచూరి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లారు. అనంతరం ఆయన.. 1977-78 మధ్య జేఏన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐకి జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1984 సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి.. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించారు. 1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్ పొందారు. 2005 నుంచి 2015 వరుసగా మూడు సార్లు ప్రధాన కార్యదర్శిగా.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అలాగే.. హిందుస్థాన్‌ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్.. 20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ గా పని చేశారు.

Read Also: Big Breaking: సీతారాం ఏచూరి కన్నుమూత..

సీతారాం ఏచూరికి ఇంద్రాణి మజుందార్‌తో వివాహం అయింది. ఏచూరికి కూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరి ఉన్నారు. జర్నలిస్ట్ సీమా చిస్తీని ఆయన రెండవ వివాహం చేసుకున్నారు. 2021 ఏప్రిల్ 22న కొవిడ్‌తో కొడుకు ఆశిష్ చనిపోయాడు.

Show comments