Sitara Commercial Ad: సితార తొలి కమర్షియల్ యాడ్.. టైమ్ స్వ్కేర్‌పై ఫొటోల ప్రదర్శన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMJ Jewels Launched Sitara Collections: ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే వెండి తెరపై మెరిసిన సీతూ పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సాంగ్స్, డాన్స్, స్టడీ, గేమ్స్, ట్రిప్స్.. ఇలా ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంటారు. సితార టాలెంట్ చూసి ఆమె తల్లిదండ్రులు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ తెగ ఆనందపడిపోతుంటారు. ముఖ్యంగా తన గారాల పట్టి ప్రతిభను చూసి సూపర్ స్టార్ సంతోషపడిపోతారు. తాజాగా సితార తొలి కమర్షియల్ యాడ్ (Sitara First Commercial Ad) చేశారు.
మహేశ్ బాబు గారాల పట్టి సితార తాజాగా ‘పీఎంజే జువెలరీ’కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్ ఇది. ఈ యాడ్ కోసం సీతూ పాప మూడు రోజులు షూటింగ్లో పాల్గొన్నారని సమాచారం. సితార చేసిన తొలి కమర్షియల్ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాత టైమ్ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ఈ విషయాన్ని ‘మహేశ్ సోషల్ మీడియా టీమ్’ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం సితారకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
Also Read
‘ప్రిన్సెస్ సితార’ అని టైమ్ స్వ్కేర్‌పై రాసి ఉంది. ఫోటోలలో సీతూ పాప పలు రకాల జువెలరీ వేసుకుని చాలా అందంగా ఉన్నారు. టైమ్ స్వ్కేర్‌పై సితార పోటోలను చూసి మహేశ్ బాబు ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. టైమ్స్వ్కేర్లో సితారను చూడడం చాలా గర్వంగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అతి చిన్నవయసులో సితారకు దక్కిన గొప్ప గౌరవం అని అభిమానులు పేర్కొంటున్నారు. మంగళవారం (4 జూలై) అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా సితార పోటోలను టైమ్ స్వ్కేర్‌పై ప్రదర్శించారు. సీతూ పాప మరోసారి సోషల్ మీడియా స్టార్ అయ్యారు.
Also Read: Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్
https://www.instagram.com/p/CuRJmGuPERN/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
When Charm meets Tradition❤️🔥
PMJ Jewels proudly launched the "SITARA COLLECTION" 💫Little Princess #SitaraGhattamaneni's first commercial Ad was launched at Times Square, New York on the 4th of July amid the grand celebrations of American Independence Day💥#PMJSitara pic.twitter.com/Up80HPmVEW
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) July 4, 2023
PMJ Jewellers Launch Sitara Collection Enchanting Superstar @urstrulyMahesh’s Daughter #Sitara 💝 pic.twitter.com/2nOKeGVymu
— Pandu Gadu 2.0 (@PanduGadu2_0) July 4, 2023
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!