NTV Telugu Site icon

Poll violence in AP: ఏపీలో అల్లర్లపై నేడు మరో నివేదిక ఇవ్వనున్న సిట్..

Sit

Sit

Poll violence in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై నేడు మరో నివేదికను సిట్ ఇవ్వనుంది. సోమవారం ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే.. కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ.. కేసులపై పర్యవేక్షణ ఇకపై కూడా చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కేసుల పర్యవేక్షణపై పురోగతితో పాటు మరో రిపోర్ట్ సిట్ టీమ్ సిద్ధం చేయనుంది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం సిట్ అధికారులు పర్యవేక్షించనున్నారు. పురోగతి రిపోర్ట్ ఎన్నికల కౌంటింగ్ లోపు ఏపీ డీజీపీ హరిష్ కుమార్ గుప్తాకి ఇచ్చే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు పరారీలో 1,152 మంది నిందితులు ఉన్నారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కాగా, తాడిపత్రిలో 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో 471 మంది, తిరుపతిలో 47 మంది, తాడిపత్రిలో 636 మంది నిందితులు పరారీ అయినట్లు పేర్కొనింది. అలాగే, తాడిపత్రి అల్లర్ల కేసులో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయింది. కాగా, ఇప్పటి వరకు 33 కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 1370 మంది నిందితులు ఉండగా.. పల్నాడు 22, తిరుపతి 4, అనంతపురంలో 7 కేసులు నమోదు చేయబడ్డాయి. ఇప్పటి వరకు 124 మంది అరెస్ట్ చేయగా.. 94 మందికి నోటీసులు పంపించారు. కొన్ని ఎఫ్ఐఆర్ లలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ తెలిపింది. మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్ లు నమోదు.. దర్యాప్తులో అనేక లోపాలు గుర్తించామని పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. అల్లర్లను చాలా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తున్నాం.. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్లదాడి జరిగింది.. ఇకపై అల్లర్లకు సంబంధించి నమోదైన కేసులను కూడా సిట్ అధికారులు పర్యవేక్షించనున్నారు.