ఎన్నికల సందర్భంగా పల్నాడులో జరిగిన ఘర్షణలపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలి అని ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడు లో అరాచకం చేశారు.. టీడీపీ, అధికారులు కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు అవాస్తవం అని చెప్పుకొచ్చారు. సిట్టింగ్ జడ్జితో మా కాల్ డేటా చెక్ చెపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. వైసీపీ నాయకులు ఎంత మంది పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు. టీడీపీకి మద్దతు పలుకుతున్నారు అన్న అనుమానంతో అనేక కుటుంబాలను వేధించారు.. 2024లో జరిగిన ఎన్నికలు ప్రజలు పని చేసిన ఎన్నికలు.. అనేక మంది ప్రజలు, అరాచకానికి వ్యతిరేకంగా పోరాడారు అంటూ లావు కృష్ణ దేవరాయలు తెలిపారు.
Read Also: Weight Loss Tips : భోజనం చేశాక ఈ డ్రింక్ తాగితే చాలు.. ఆ సమస్యలు మాయం..
మేము పారదర్శకంగా ఎన్నికల పోటీలో పాల్గొన్నాం అని లావు కృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. మేం లాలూచీ లు పడే రకం కాదు.. ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి పోలీసులు సరిగ్గా పని చేయలేదు.. నరసరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి వాహనాలు పగల గొట్టారు.. దొండ పాడులో నా వాహనాలు పగలు కొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.. ఘర్షణలు జరుగుతున్నా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు చెప్పాలి.. అలాగే, ఈ ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తు చేయాలి అంటూ లావు కృష్ణ దేవరాయలు డిమాండ్ చేశారు.