TSPSC పేపర్ లీక్ కు సంబంధించి రెండో రోజు నిందితులను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్ లో కొత్త లింకులు వెలుగులోకి వచ్చాయి. రాజశేఖర్ మరికొందరికీ పేపర్ ఇచ్చినట్లు సిట్ బృందం గుర్తించింది. ఈ మేరకు వాట్సాప్ చాట్ ను సిట్ రిట్రీవ్ చేసింది. ఈక్రమంలో గ్రూప్ 1 పేపర్ ను చాలా మందికి సర్య్కూలేట్ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా విచారించారు. వీరి ముందు చాట్ డేటా పెట్టి అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ లీక్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు.
Also Read : Viral Dog : అబ్బా.. బుడ్డోడిని చూడగానే బలే ఊపేస్తుందే..
రెండు కంప్యూటర్లను ఫోరెన్సీక్ ల్యాబ్ కు సిట్ అధికారులు తరలించారు. అంతేకాకుండా ఐదు పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ చాట్ లో గుర్తించారు. గత ఏడాది అక్టోబర్ నుంచే పలు పరీక్షలకు ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. కమిషన్ కార్యాలయానికి చెందిన ఓ ఉద్యోగి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ దొంగలించడం ద్వారా ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్ లో కాపీ చేసినట్లుగా రాజశేఖర్ చెప్పినప్పటికీ.. అందులో నిజం లేదని అధికారులు గుర్తించారు. సిట్ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read : మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..
ఇదిలా ఉంటే.. తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్( టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం నాడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ టీమ్ నివేదికతో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.