NTV Telugu Site icon

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు

Sit

Sit

Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్‌ సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్‌జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఉండనున్నారు. కల్తీ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీ వినియోగించారనే నేపథ్యంలో కల్తీ ఎలా సరఫరా అయింది.. ఏ మేరకు సరఫరా అయిందనే విషయాలపై సిట్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వివాదానికి సంబంధించి కారకులు ఎవరనే విషయంపై సిట్‌ ఆరా తీయనున్నట్లు సమాచారం.

Read Also: AP Excise Dept: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు