నిర్మాతలుగా రాణించడం కత్తిమీద సాము లాంటిది. అలాంటి లైఫ్ అండ్ డెత్ డిపార్ట్ మెంట్‌లో ప్రొడ్యూసర్స్‌గా ఛేంజై సక్సెస్ కొడుతున్నారు స్టార్ డాటర్స్. మొన్నటి వరకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొనసాగిన చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత.. గోల్డ్ బాక్స్ ఎంటర్మైన్ మెంట్ ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసి పరువు వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఓటీటీలో ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు దక్కడంతో.. వెంటనే తండ్రితో మన శంకర్ వరప్రసాద్ గారూ తీసి తన తండ్రి ఖాతాలో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని నిలిపింది. ప్రొడ్యూసర్‌గా సుస్మిత మంచి లాభాలనే చూసింది. తండ్రి సపోర్ట్ ఉన్నా.. ఇండివిడ్యువల్‌గా తాను ఎదగాలనుకుంది.
Also Read : LEADER : వచ్చింది రూ. 3కోట్లు…వేసుకుంది రూ. 25కోట్లు
రజనీకాంత్ డాటర్స్ సినీ రంగంలో ఫ్రూవ్ చేసుకోవాలని మెగాఫోన్ పట్టారు కానీ తండ్రి ఇమేజ్ డ్యామేజ్ చేశారు. కొచ్చాడియన్‌తో చిన్న కూతురికి దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు తలైవా. కట్ చేస్తే మూవీ ఆల్ట్రా డిజాస్టర్ గా మారింది. నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. ఆ తర్వాత మాజీ బావ ధనుష్‌తో వీఐపీ2 తీసింది. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా.. ఫస్ట్ పార్ట్‌తో పోల్చుకుంటే తేలిపోయింది. దీని తర్వాత కెమెరా జోలికి పోలేదు సౌందర్య. తనకు కాస్తో కూస్తో ప్రావీణ్యం ఉన్న నిర్మాణ రంగంలోనే మళ్లీ ట్రై చేసి సక్సెస్ కొట్టింది. 16 ఏళ్ల తర్వాత విత్ లవ్ తెరకెక్కించి భారీ లాభాలను చవిచూసింది సౌందర్య. అక్క సుస్మిత మన శంకర్ వరప్రసాద్‌తో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొడితే.. గుడ్ ఫ్రైడేకు సిస్టర్ నిహారిక సక్సెస్ చూసింది. రాకాసతో మరో హిట్ నమోదు చేసింది. పింక్ ఎలిఫెంట్ ఫిక్చర్స్‌పై తెరకెక్కిన రాకాస పాజిటివ్ రివ్యూతో దూసుకెళుతోంది. మూడు రోజుల్లో రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసి.. బడ్జెట్ డబ్బులు రాబట్టుకుంది . సిల్వర్ స్క్రీన్‌పై కమిటీ కుర్రాళ్లతో నిర్మాతగా మారి హిట్ చూసిన నిహారిక.. రాకాసతో మరో సక్సెస్ చూసింది. మొత్తానికి మెగా అండ్ తలైవా డాటర్స్… నిర్మాతలుగా సక్సెస్ అందుకున్నారు.
