Site icon NTV Telugu

Rajanna Sircilla District: ఇంటిపై పడిన పిడుగు.. నాలుగేళ్లలో రెండోసారి..

Siricilla

Siricilla

Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్‌లో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంతో ఓ ఇంటిపై పిడుగుపాటు చోటుచేసుకుంది. పట్టణంలోని భగవంతు రావునగర్‌లో నివాసముంటున్న చిలుకల దేవయ్య ఇంటిపై అకస్మాత్తుగా పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న టెలివిజన్, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంటి పైభాగంలోని గోడకు పిడుగు తగలడంతో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

READ MORE: CM Chandrababu: రప్పా.. రప్పా.. అని రంకెలేస్తున్నారు.. ఇక్కడున్నది సీబీఎన్, పవన్ కల్యాణ్..

అయితే, ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇదే ఇంటిపై గత నాలుగు సంవత్సరాల క్రితం కూడా పిడుగు పడినట్లు స్థానికులు తెలిపారు. వర్షాకాలంలో పిడుగుపాట్లు ఎక్కువగా సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

READ MORE: Nepal: క్లియర్ మెసేజ్ ఇచ్చిన నేపాల్ ఆర్మీ చీఫ్.. ‘‘హిందూ రాజ్యం’’గా మారుతుందా..?

Exit mobile version