Siri Hanmanth: షణ్ముఖ్ అరెస్ట్.. ఇలా అవుతుందని అనుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siri Hanmanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న షణ్ముఖ్ పై కేసు నమోదయ్యింది. ఇక ఎందుకు షన్ను ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నాడని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. అసలు అంతలా అతనికి డిప్రెషన్ వచ్చేలా చేసింది ఎవరు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. షన్ను అరెస్ట్ పై బిగ్ బాస్ ఫేమ్, జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంత్ స్పందించింది. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్. హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. వీరి మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజులు మాట్లాడుకున్న ఈ జంట.. రూమర్స్ వలన మాట్లాడుకోవడం మానేశారు.
ఇక సిరి వలనే దీప్తి, షన్ను విడిపోయారని రూమర్ కూడా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిరి, షన్ను అరెస్ట్ పై స్పందించింది. ” హౌస్ నుండి బయటకు వచ్చాక తనపై ట్రోలింగ్ నడిచింది. రూమర్స్ బాధపెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను. షన్ను పర్సనల్ లైఫ్ లో ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చాక మేము మాట్లాడుకోవడం మానేశాం. ఇక అతనికి బ్రేకప్ అయ్యాకా.. నేను కలవడం పద్దతి కాదని మానేశాను. ఇప్పుడప్పుడే షన్నును కలవడం జరగదు. మేము కలిసినా, కలవకపోయినా అతడు బావుండాలనే కోరుకుంటాను. మేము ఎప్పుడు కలుస్తామన్నది నాకే తెలియదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!