Site icon NTV Telugu

Siri Hanmanth: షణ్ముఖ్ అరెస్ట్.. ఇలా అవుతుందని అనుకోలేదు

Siri

Siri

Siri Hanmanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్‌ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న షణ్ముఖ్ పై కేసు నమోదయ్యింది. ఇక ఎందుకు షన్ను ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఎవరికి అంతుపట్టని ప్రశ్న. ఇక షన్నును అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకున్నాడని, ఆత్మహత్య కూడా చేసుకుందామనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. అసలు అంతలా అతనికి డిప్రెషన్ వచ్చేలా చేసింది ఎవరు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. షన్ను అరెస్ట్ పై బిగ్ బాస్ ఫేమ్, జబర్దస్త్ యాంకర్ సిరి హన్మంత్ స్పందించింది. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఫ్రెండ్స్. హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. వీరి మధ్య ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజులు మాట్లాడుకున్న ఈ జంట.. రూమర్స్ వలన మాట్లాడుకోవడం మానేశారు.

ఇక సిరి వలనే దీప్తి, షన్ను విడిపోయారని రూమర్ కూడా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిరి, షన్ను అరెస్ట్ పై స్పందించింది. ” హౌస్ నుండి బయటకు వచ్చాక తనపై ట్రోలింగ్ నడిచింది. రూమర్స్ బాధపెట్టాయి. అయితే ఆ డిప్రెషన్ నుండి నేను త్వరగానే బయటపడ్డాను. షన్ను పర్సనల్ లైఫ్ లో ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చాక మేము మాట్లాడుకోవడం మానేశాం. ఇక అతనికి బ్రేకప్ అయ్యాకా.. నేను కలవడం పద్దతి కాదని మానేశాను. ఇప్పుడప్పుడే షన్నును కలవడం జరగదు. మేము కలిసినా, కలవకపోయినా అతడు బావుండాలనే కోరుకుంటాను. మేము ఎప్పుడు కలుస్తామన్నది నాకే తెలియదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version