NTV Telugu Site icon

IND vs SL: వన్డే చరిత్రలో సిరాజ్ అరుదైన రికార్డు

Siraj 2

Siraj 2

ఆసియా కప్ 2023లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతితో విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ తన రెండో ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టడంతో వన్డే క్రికెట్‌లో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో.. సిరాజ్ ఇప్పుడు వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఈ సంఖ్యను చేరుకున్న భారతదేశం నుండి మొదటి ఆటగాడిగా, ప్రపంచ క్రికెట్‌లో రెండవ అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

Read Also: Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి హీరోగా ‘మెగా’.. అదరగొట్టేశాడు అంతే..

మహ్మద్ సిరాజ్ వన్డే ఫార్మాట్‌లో తన 50 వికెట్లను పూర్తి చేయడానికి 1002 బంతుల ప్రయాణం చేశాడు. ఈ సందర్భంలో నంబర్-1 స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ స్పిన్ బౌలర్ అజంతా మెండిస్ 847 బంతుల్లో తన 50 వన్డే వికెట్లను పూర్తి చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో చరిత్ అసలంక రూపంలో సిరాజ్ తన 50వ వన్డే వికెట్‌ను అందుకున్నాడు.

Read Also: Underwear Economy Index: అండర్ వేర్ శరీరానికే కాదు ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యం ఎలాగంటే?

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ బంతితో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. 7 ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులకే పరిమితమైంది.

Read Also: IND vs SL: హైదరాబాదీ బౌలరా మజాకా.. సిరాజ్ దెబ్బ మాములుగా లేదు

వన్డేల్లో 2002 తర్వాత తొలిసారిగా.. తొలి 10 ఓవర్లలో 5 వికెట్లు తీసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ నిలిచాడు. అంతకుముందు 2003లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జవగల్ శ్రీనాథ్ తొలి 10 ఓవర్లలో 4 వికెట్లు, 2013లో శ్రీలంకపై భువనేశ్వర్ కుమార్, 2022లో జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టారు.

Show comments