ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక బ్యాట్స్ మెన్స్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ ఓడిన భారత్.. బౌలింగ్ కు దిగింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఓవర్లనే శ్రీలంక మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ సంచలన స్పెల్ తో శ్రీలంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ శ్రీలంక జట్టుకు డిజాస్టర్‌గా మారాడు.
Read Also: Strange News: వామ్మో.. నీ ధైర్యం పాడుగానూ.. ఐదు వేల తేళ్లతో గాజు గదిలో 33రోజులు
సిరాజ్ వేసిన రెండో ఓవర్లో మొదటి వికెట్ పడగొట్టగా.. మళ్లీ ఆ తర్వాత వేసిన మరో ఓవర్ లో ఏకంగా 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వన్డే క్రికెట్‌లో సిరాజ్ తొలిసారి ఈ ఘనత సాధించాడు. పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ్ డి సిల్వా, దసున్ షనకలకు సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై సిరాజ్ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు శ్రీలంక మాజీ గ్రేట్ బౌలర్ లసిత్ మలింగ మాత్రమే వన్డేల్లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
Read Also: Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. బాలయ్య సినిమా క్యాన్సిల్..?
మరోవైపు కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని.. నేటి మ్యాచ్ కు ముందు విశ్లేషణలు వచ్చాయి. కానీ టీమిండియా పేసర్లు ఆ పరిస్థితిని తారుమారు చేశారు. ప్రస్తుతం శ్రీలంక 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది. చివరలో శ్రీలంక బౌలర్లే అడపదడపా ఆడుతున్నారు.