NTV Telugu Site icon

IND vs AUS: సిరాజ్‌ను రెచ్చగొట్టిన లబుషేన్.. అతని దగ్గరికి వెళ్లి ఏం చేశాడంటే..? (వీడియో)

Siraj

Siraj

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజు మ్యాచ్‌ ఆటను ఎవరూ ఊహించలేదు. పెర్త్‌లో తొలిరోజు మొత్తం 17 వికెట్లు పడ్డాయి. 1952 తర్వాత ఆస్ట్రేలియాలో తొలిరోజు అత్యధిక వికెట్లు పడిన రికార్డు ఇదే. ఈ క్రమంలో తొలిరోజే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో నాథన్ లియాన్, మార్ష్.. పంత్‌ను ఇబ్బంది పెట్టినట్లు అనిపించగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. తన కళ్ల ముందే ఆసీస్ బ్యాటర్లంతా వరుసగా ఔట్ అవుతుండటంతో లబుషేన్ తట్టుకోలేకపోయాడు. భారత బౌలర్ల ఏకాగ్రతను దెబ్బతీయాలని భావించాడు.

Winter: చలికాలంలో శ్వాసకోస బాధితులు తీసుకోవల్సిన జాగ్రత్తలివే!

ఈ క్రమంలో లబుషేన్ సిరాజ్‌ను గెలికాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 13వ ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని మార్నస్‌ లబుషేన్ ఆపే ప్రయత్నం చేశాడు. సిరాజ్ వేసిన బంతి లబుషేన్ ప్యాడ్‌కు తగిలి అక్కడే ఆగిపోయింది. బంతి స్టంప్‌కు దూరంగా ఉంది.. లబుషేన్ క్రీజు వెలుపల ఉన్నాడు. అయితే సిరాజ్ బంతి దగ్గరకు చేరుకోగానే.. లబుషేన్ తన బ్యాట్‌తో బంతిని క్రీజు వెలుపలికి పంపాడు. దీంతో సిరాజ్ అప్పీల్ చేస్తూ పరుగెత్తుకుంటూ లబుషేన్‌ పైకి దూసుకెళ్లాడు. కళ్లలోకి కళ్లు పెట్టి ఏంటీ ఇదని ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

MK Stalin: అదానీ లంచం ఆరోపణలపై సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

ఆ తర్వాత భారత ఫాస్ట్ బౌలర్లు అతడిని టార్గెట్ చేయడంతో కేవలం 2 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. భారత బౌలర్ల అద్భుత బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. బుమ్రా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హర్షిత్, సిరాజ్ కూడా వికెట్లతో చెలరేగారు. కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులతో ఉంది. టీమిండియా స్కోరుకు ఇంకా 83 పరుగుల దూరంలో ఉంది.