Site icon NTV Telugu

Kamareddy: సార్ నా భ్యార్య నన్ను రోజూ కొడుతోంది.. డ్రాయర్‌ మీద ఠాణాకు వచ్చిన బాధితుడు

New Project (36)

New Project (36)

కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు. గృహహింస, వరకట్న వేధింపుల చట్టం లాంటి కేసులు వారికి రక్షణగా నిలుస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు కూడా ఉందండోయ్. ప్రస్తుతం భార్యలు కూడా చేతులకు పనిచెబుతున్నారు. నాలుగు గోడల మధ్య ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య రోజూ కొడుతోందంటూ.. ఓ భర్త కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మామూలుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే తన బాధ అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో.. ఒంటి మీద బట్టలు లేకుండా.. డ్రాయర్ తో స్టేషన్ కు చేరుకున్నాడు. పోలీసులతో తన బాధను చెప్పుకున్నాడు.

READ MORE: AI for Google Search: ఇక గూగుల్ సెర్చ్ లో కుడా ఏఐ.. ఈ 8 ఫీచర్లు అస్సలు మిస్ కావద్దు!

తనకు భార్య నుంచి కాపాడాలంటూ.. పోలీసులను ఆ బాధిత భర్త వేడుకున్నాడు. తనను ప్రతిరోజూ కొడుతుందంటూ గుక్కతిప్పుకోకుండా తన బాధలు చెప్పుకున్నాడు. ఆ భర్త బాధలు విన్న పోలీసులు కూడా అతని మీద సానుభూతి వ్యక్తం చేసి.. భార్యాభర్తలకు సర్ధి చెప్పి పంపించారు. ఆ భర్త బాధలు విన్న స్థానికులు.. “నీ కష్టం పగోనికి కూడా రావొద్దు భయ్యా..” అంటూ సానుభూతి ప్రకటించారు. ఎంత బాధ అనుభవిస్తే.. ఇలా బయటకు వచ్చి తన గోడు వెల్లబోసుకుంటాడంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ భార్య తన భర్తను ఎందుకు కొడుతుంది.. అతను ఎలాంటి పనులు చేస్తే ఆమె ఇలా రియాక్ట్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version