NTV Telugu Site icon

Singireddy Niranjan Reddy : గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలి

Singireddy Niranjan Reddy

Singireddy Niranjan Reddy

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 420 హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని, ప్రజలు అడగకుండానే అన్ని పథకాలు అందించిన వ్యక్తి కేసీఆర్‌ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అబద్ధమే నిజమనేలా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియా ప్రచారం చేసిందని, అనవసర విషయాలను వార్తలుగా మలిచాయన్నారు.

IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!

కారణం ఏదైనా పార్టీ శ్రేణుల్లో కొంత నిరాసక్తత వ్యక్తం అయిందని, కొత్తగా వచ్చిన ఓటర్లకు తెలంగాణ త్యాగాలు నేర్పలేదన్నారు. ఉద్యోగులకు 77% ఫిట్మెంట్ అందించిన సంతృప్తి పడలేదని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన, టీఎస్పీఎస్సీ చేసిన తప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం పై రుద్దారని, పథకాల అమలులో సఖ్యత పాటించలేదన్నారు నిరంజన్‌ రెడ్డి. తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 40 ఏళ్ళైనా ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ఇద్దరమ్మ రాజ్యం అంత అద్భుతంగా ఉంటే ఇప్పటికి దేశంలో పేదరికం ఎందుకు ఉంది. అసమానతలు ఎందుకు ఉన్నాయని, 130 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారం చేజిక్కించుకొని దయనీయంగా మారిందన్నారు. ప్రజలకు తగ్గట్టుగా వ్యవహరించడం మన బాధ్యతని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేద్దామన్నారు.

IND vs ENG: ముగిసిన భారత్ రెండో ఇన్సింగ్స్.. ఇంగ్లండ్ టార్గెట్ 399