Singeetham Srinivasa Rao: తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, వినూత్న కథనాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో అగ్రగణ్యులు సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ముందుగా ఒక పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ లెజెండరీ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం SSR61 అనే వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతుంది. త్వరలో సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
READ ALSO: Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదే?
నిజానికి సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తీయక ముందే ఒక సరికొత్త హిస్టరీని ప్రపంచ సినిమా చరిత్రపై లిఖించారు. ఎలాగో తెలుసా.. ప్రపంచంలో రెండో అతి పెద్ద వయస్సు దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు నిలిచారు. ఆయన కంటే ముందు మానోయెల్ డి ఒలివేరా ఉన్నారు. మానోయెల్ డి ఒలివేరా 103 ఏళ్ల వయసులో సినిమాకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. దాదాపు 10-12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాను తెరకెక్కుస్తున్న సింగీతం శ్రీనివాసరావు కమ్‌బ్యాక్‌పై దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి నుంచి టాలీవుడ్ దర్శక నిర్మాతలందరూ సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. సింగీతం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను సింగీతం గారి కెరీర్‌లోనే అత్యంత అంబిషియస్ చిత్రంగా రూపుదిద్దుకుంటుందని నిర్మాతలు తెలిపారు. సింగీతం గారు గతంలో కల్కి 2898 ఏడీకి క్రియేటివ్ సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన స్వయంగా దర్శకత్వం చేపట్టడం, ఈ సినిమా ఇంకా తెరకెక్కముందే సింగీతం గారు చరిత్ర సృష్టించడంపై సినిమా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Stock Market: గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్ .. అంబానీకి కలిసొచ్చిన వేల కోట్ల అదృష్టం!
