Sarke Chunar Song: ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా! నెటిజన్లు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarke Chunar Song: తెలుగులో భక్తి పాటలు పాడుకునే మంగ్లీకి.. ఇదేం పోయే కాలం అని నెట్టిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమాలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ (Sarke Chunar Teri Sarke) అనే పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ నెగిటివిటీని ఎదుర్కొంటోంది. పాటలోని అశ్లీల సాహిత్యం, డబుల్ మీనింగ్ విజువల్స్ పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
READ ALSO: The myth of Baba Vanga: అంతా ట్రాష్.. ఆపండి మీ అబద్ధాలు.. బాబా వంగా పేరుతో ఫేక్ న్యూస్!
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
యూట్యూబ్‌లో ‘ప్రైవేట్’గా మారిన సాంగ్
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన నిరసనలు, ట్రోలింగ్ కారణంగా ఈ పాటను యూట్యూబ్ నుంచి మేకర్స్ తొలగించారు. ప్రస్తుతం ఈ సాంగ్ లింక్‌పై క్లిక్ చేస్తే “వీడియో అందుబాటులో లేదు.. ఇది ప్రైవేట్ వీడియో” అనే మెసేజ్ కనిపిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు వివాదానికి కారణం ఏంటంటే.. ఈ పాటలో ఉపయోగించిన పదాలు. ఈ లిరిక్స్‌లోని పదాలు చాలా అసభ్యకరంగా ఉన్నాయని, కుటుంబంతో కలిసి చూసేలా లేవని నెటిజన్లు మండిపడ్డారు. నోరా ఫతేహి డ్యాన్స్ స్టెప్పులు, లిరిక్స్ ‘భయంకరమైన’ డబుల్ మీనింగ్ అర్థాలను ఇస్తున్నాయని విమర్శలు వచ్చాయి. ఇంతకీ ఈ పాటను పాడింది ఎవరో తెలుసా.. మంగ్లీ. భక్తి పాటలు పాడుకునే మంగ్లీ.. ఇలాంటి బూతు పాటలు ఎలా ఒప్పుకున్నారని నెట్టిజన్లు మండిపడుతున్నారు. ఇకపోతే ఈ పాటను రాసిన రాకీబ్, సినిమా డైరెక్టర్ ప్రేమ్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య, గాయని మంగ్లీపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా అభ్యంతరకర సాహిత్యంపై నోటీసులు జారీ చేసింది.
సామాన్య ప్రజలతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ పాటకు వ్యతిరేకంగా గళమెత్తారు. ఈ పాటపై ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్ స్పందిస్తూ.. “లిరిక్స్ రాసే విధానంలో ఇది అత్యంత దిగజారుడు తనం” అని విమర్శించారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పాటను తీవ్రంగా వ్యతిరేకించారు. రకీబ్ ఆలం సాహిత్యం అందించిన ఈ పాటలో సంజయ్ దత్ కూడా కనిపించారు. భారీ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో, సినిమాపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు మేకర్స్ ఈ పాటను ప్రస్తుతానికి స్ట్రీమింగ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
READ ALSO: Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్
తాజావార్తలు
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!