Site icon NTV Telugu

Singer Kalpana: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన సింగర్ కల్పన.. వారిపై ఫిర్యాదు

Singar Kalpana

Singar Kalpana

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదన సింగర్ కల్పన కలిసింది. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసుకున్నానంటూ.. కొన్ని యూట్యూబ్ ఛానల్‌లు తన ప్రైవేట్ వీడియోలతో ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కల్పన డిమాండ్ చేసింది. కాగా… అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన కోలుకున్న విషయం తెలిసిందే. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ నిన్న ఓ వీడియో విడుదల చేసింది. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు తెలిపింది.

READ MORE: Ranya Rao: సినీ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం..

‘‘మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసుల, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను. ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ వీడియో విడుదల చేసింది.

READ MORE: Karnataka: బెంగళూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన.. హక్కుల కోసం పోరాటం..

Exit mobile version