NTV Telugu Site icon

KTR : సింగరేణి కాలరీస్‌ను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

Ktr

Ktr

16 ఎంపీలు సాధించిన టీడీపీ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో చేరి 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ , బీజేపీ గెలిచిందని, సింగరేణి బొగ్గు గనులను బహిరంగ మార్కెట్‌లో రేపు కేంద్రం వేలం వేయబోతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేసీఆర్‌ ప్రధానికి లేఖ రాశారని, మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపాలని అప్పటి ప్రధాని మోడీ కి లేఖ రాశారన్నారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మోడీని అప్పుడు కోరారు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ అని ఆయన అన్నారు. గత కేంద్ర ప్రభుత్వ హయంలో ఒడిశా లో , గుజరాత్ లో గనులను ప్రభుత్వ రంగ సంస్థలకే కేటాయించారని ఆయన అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోయింది.. ప్రైవేటీకరణ చేస్తున్నాం అని అన్నారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు దగ్గరలో గనులు ఇవ్వకుండా…ఆధానికి …ఇంకా ఎవరికో పోయిందన్నారు. సింగరేణి పై ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర జరుగుతుందని, సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఎందుకు సింగరేణి బహిరంగ వేలంలో పాల్గొంటామని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తొమ్మిదనర ఏళ్ల పాటు సింగరేణి బొగ్గు గనుల వేలం వేయకుండా బీఆర్‌ఎస్‌ అడ్డుకున్నదన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఖతం చేసినట్టు సింగరేణి కెలరీస్ విషయంలో కూడా కాంగ్రెస్ బీజేపీలు అనుసరిస్తున్నాయని, సింగరేణికి కాప్టివ్ మైన్ లు కేంద్ర ఇవ్వడం లేదని, సింగరేణి నీ కాపాడాలని బొగ్గు గనుల వేలం ను కెసిఅర్ అడ్డుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క,కిషన్ రెడ్డి నీ డిమాండ్ చేస్తున్నామని, కిషన్ రెడ్డి కొత్తగా రాష్ట్రం కు ప్రాజెక్టు తీసుకుని రాకుండా ఉన్నవి అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి వైఖరి ఎందుకు మారింది ? గతంలో గనుల వేలం వద్దనీ ఇప్పుడు ఎందుకు రాజీ పడుతున్నారు…కేసుల భయమా ? అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కాలరీస్‌ను బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, 8 మంది బిజెపి ఎంపీలను ఇస్తే …తెలంగాణ కు మీరు ఇదా ఇచ్చ్చే రిటర్న్ గిఫ్ట్ అన్నారు. బీజేపీ నిర్ణయం ను కాంగ్రెస్ కు ఎందుకు వంతు పాడుతున్నారు ? అని ఆయన అన్నారు. నాలుగు గనులు సింగరేణి కెలరేస్ ఇచ్చే అవకాశం ఉంది…ఎందుకు కేంద్రం ఇవ్వడం లేదు ? అనిఆయన అన్నారు. సింగరేణి మీద కేంద్రము కత్తి పెడితే…రేవంత్ ఆ కత్తికి సానా పడుతున్నారన్నారు. సింగరేణికి ప్రమాదం వస్తె కాపాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అని ఆయన అన్నారు. సింగరేణి గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ప్రయత్నం అడ్డుకుంటామని, ప్రైవేట్ సంస్థలకు ఇప్పుడే చెబుతున్నాం…మళ్ళీ మేము అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ను నిలిపివేస్తామన్నారు. ప్రైవేట్ సంస్థలకు చెబుతున్నాం…జాతి ప్రయోజనలు ముఖ్యమన్నారు. సింగరేణి బొగ్గు గనుల వేలం పాట ఆపాలన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి…కెసిఅర్ అధికారంలో ఉన్న కాలం బొగ్గు గనుల వేలం జరగలేదన్నారు. రేపు వేలంలో పాల్గొనే వాళ్ళకి మళ్ళీ చెబుతున్నాం…మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల కేటాయింపు నిర్ణయాలను ఆపేస్తమన్నారు.