Site icon NTV Telugu

CM Revanth Reddy : సింగరేణి కొత్త శకానికి నాంది పలికింది

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : ఇవాళ్టి ప్రత్యేక ఘట్టంగా సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించటంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 136 ఏళ్లకు పైగా తెలంగాణ సింగరేణి తన బొగ్గు తవ్వకాలను నిర్వహించి రాష్ట్రానికి వెలుగులు పంచుతుంటే, ఇప్పుడు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలు ప్రారంభించడం ద్వారా సింగరేణి సంస్థ భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుంది అని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ వేదిక పోస్ట్‌ చేశారు. ప్రజా ప్రభుత్వ తీసుకున్న ప్రత్యేక చొరవ ద్వారా సింగరేణి సంస్థ మొదటిసారిగా దేశంలోని ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించడాన్ని సాధ్యం చేసినట్లు పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఒడిశాలోని అంగుల్ జిల్లాలో నైనీ గని ప్రారంభించడం సింగరేణి సంస్థ కొత్త శకానికి నాంది పలుకుతుందని అన్నారు.

నైనీ బొగ్గు గనికి అన్ని అనుమతులు పొందడం, తద్వారా తవ్వకాలు ప్రారంభించడమ అనేది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది సింగరేణి సంస్థ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

సింగరేణి సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి మణిమకుటగా, వెంకలవెయ్యి కార్మిక కుటుంబాలకు జీవనాధారం ఇచ్చే సంస్థగా నిలుస్తూ, వృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఈ విధమైన అనేక ప్రాజెక్టులకు ప్రముఖ మద్దతు అందజేస్తామని ఆయన తెలిపారు.

Good Bad Ugly: కొడుకు డైరెక్టర్ తండ్రి అసోసియేట్ డైరెక్టర్‌

Exit mobile version