స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయబేరి సభలో అభ్యర్థి సింగపురం ఇందిర మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే… బీఆర్‌ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 నిలబడితే.. 5 గురు నాయకులు.. కేటీఆర్ దత్తత తీసుకున్న ఘనపూర్ కు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ముగ్గు పోయని దుస్థితి అని ఆమె అన్నారు. శ్రీహరి 420 ఎన్‌కౌంటర్ చేపించండి అని హరీష్ రావు అన్నాడని, ఇక్కడ నాకు టికెట్ రాగానే… ఎన్‌కౌంటర్‌ల శ్రీహరి కిడ్నాప్ ల శ్రీహరి గా మారిండన్నారు. కడియం శ్రీహరి నన్ను స్థానికురాలు కాదంటున్నవ్… నీ కూతుళ్లకు అత్త గారిల్లు స్థానికం కాదా అని ఆమె అన్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్నాడు కడియం శ్రీహరి అని ఆమె మండిపడ్డారు. ఒక్క ఊరికి డబుల్ బెడ్ రూం, ఒక్క ఉద్యోగం ఉండదు…బెల్టు షాపులు మాత్రం పెట్టిండు కేసీఆర్ అని ఆమె ఎద్దేవా చేశారు.
Also Read : Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్ న్యూస్.. పెదవి విప్పిన బాద్‌షా?
కేసీఆర్ ఆదాయం కోసం తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేసిండని, అప్పుడు బస్సులు పెట్టీ కాలేశ్వరం చూపెట్టడం కాదన్నారు. ఇప్పుడు బస్సులు నేనే పెడతా కాలేశ్వరం చూపెట్టాలని పళ్ళ రాజేశ్వర్ రెడ్డికి సవాల్.. రేవంత్ రెడ్డి రావడంతో..కేసీఆర్ కు వణుకు పుట్టిండు… ఎప్పుడు దండం పెట్టని కడియం.. ఒక్క అవకాశం ఇవ్వమని దండం పెడుతుండు.. ఎన్నికల్లో నా చేతిలో ఓటమి ఖాయం.. మూట ముల్లే చదురుకుని పర్వతగిరి పోతావ్.. అహంకారానికి…మాదిగల ఆత్మ గౌరవానికి జరుగుతున్న యుద్ధం… దళిత ద్రోహి కేసీఆర్..దళితుల పేర్లు చెప్పి మోసం చేస్తుండు… హైదరాబాదు లో భూములు అమ్మడం అయిపోయింది.. ఈ రోజు మళ్ళీ గెలిపిస్తే..ఐకెపి సెంటర్ల భూములు అమ్ముకుంటాడు. కేసీఆర్ బిడ్డ కవిత చేసే వ్యాపారం బెల్టు షాపుల బిజినెస్ … ఉద్యోగులు ఎన్ని రోజులు పోతే అంతే జీతం ఇస్తారు. ఒక్కరోజు ప్రగతి భవన్ కి పోని కేసీఆర్ కు జీతం ఎందుకు.. పెన్షన్ లు ఇచ్చిందే కాంగ్రెస్.. రుణమాఫి, సబ్సిడీ రుణాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్… స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం…’ అని సింగపురం ఇందిర వ్యాఖ్యానించారు.
Also Read : 800 Movie : ఓటీటీ లోకి రాబోతున్న ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’..