Simran Choudhary: సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simran Choudhary New Movie Starts Today: యువ కథానాయకుడు అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కార్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను సిల్వర్‌స్క్రీన్ సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్ బుయాని, అంకిత్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. డైరెక్టర్ బాబీ ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఇక హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి క్లాప్ కొట్టారు.
పూజా కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ… ‘మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకు పైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్ విశ్వజిత్ చెప్పిన ఈ లైన్ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్ బుర్రా గారు మా సినిమాకు డైలాగ్స్ రాయడం మరింత ప్లస్ అవుతుంది. మంచి హిట్ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్ కుదిరారు’ అన్నారు.
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
దర్శకుడు కార్తి మాట్లాడుతూ… ‘ఇది నాకు తొలి సినిమానే అయినా మంచి కథ, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు దొరకడం వల్ల చాలా నమ్మకంగా ఉన్నాను. ఫస్ట్ సినిమాకే టాప్ టెక్నీషియన్స్ సెట్ అవడం నా లక్‌గా భావిస్తున్నా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్ లాంటిది. జూన్ 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 3 షెడ్యూల్స్ ఉంటాయి. నన్ను నమ్మి ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’ అని తెలిపారు.
Also Read: India vs Pakistan: సూర్యకుమార్ కాదు.. అతడు ఉండటమే టీమిండియాకు ప్లస్!
హీరో అవినాష్ మాట్లాడుతూ… ‘సినిమాలంటే నాకు చాలా పిచ్చి. నేను చదువుకు కేటాయించిన సమయం కన్నా.. సినిమాల్లో గడిపిన సమయమే ఎక్కువ. నిర్మాతలు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మంచి కథ సెట్ అవడం, దానికి టాప్ టెక్నీషియన్‌లు పని చేస్తుండడం మా యూనిట్ అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా హిట్ ఫిల్మ్ ఇస్తాం’ అని పేర్కొన్నారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ… ‘మరో మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. నా క్యారెక్టర్‌కు మంచి స్కోప్ ఉంది’ చెప్పుకొచ్చారు.
రచయిత విశ్వజిత్ మాట్లాడుతూ… ‘ఈ లైన్ ఓకే అవ్వగానే సినిమా స్టార్ట్ చేయలేదు. రియాల్టీ చెక్ కోసం 6 జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన దాదాపు 150 మందిని సెలక్ట్ చేసి.. వారికి కథ చెప్పగా అందరూ చాలా బావుంది అని ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత పలు వర్క్ షాప్‌లు నిర్వహించి కాన్ఫిడెంట్‌గా షూటింగ్‌కు వెళ్తున్నాం’ చెప్పారు. పూజ కార్యక్రమానికి నిర్మాతలు అంబిక కృష్ణ, దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ నాయుడులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!